చిట్వేలి టౌన్ లో నడిబొడ్డున ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల లో వంటగది అత్యంత దారుణంగా పైన రేకులు పుచ్చిపోయి బొక్కల పడి రూమ్ అంతా కారుతూ ఉంది. రూమ్ పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో జోరున వర్షం పడుతున్న వంట మాత్రం రెడీ చేస్తున్నారు. వంట చేసే సిబ్బంది మాట్లాడుతూ ఇటువంటి కష్టాలు పగవారికి కూడా రాకూడదని వారు తెలియజేశారు. జోరు వానలో ఒకపక్క వంట చేయడానికి పొయ్యి వెలిగిస్తుంటే జోరు వానకు మంటలు ఆరిపోతున్నాయి.
ఈ సమస్య గురించి ప్రభుత్వ అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని వారు తెలియజేశారు. వంట చేసే సిబ్బంది మాట్లాడుతూ ఎవరైనా దాతలు కానీ స్వచ్ఛంద సంస్థలు ద్వారా కానీ పిల్లలకు ఉపయోగపడే వంటగదికి రేకులు తెప్పించి సహాయపడాలని వంట చేసే సిబ్బంది మరియు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు.