# నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం#
” మానవుల మాన ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవహక్కులు. ఇవి పుట్టుకతో ప్రతి వ్యక్తికి లభించే హక్కులు. నేడు నిత్యం ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం జరుగుతూనే ఉంది. జాతి, మత మౌఢ్యం వల్ల, రాజకీయ కారణాల వల్ల, వ్యక్తిగత ద్వేషం, కక్ష, కార్పణ్యాల వల్ల మనుషుల జీవితాలకు భరోసా లేకుండా పోతోంది. మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వసాధారణమయ్యాయి. ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10న ‘విశ్వమానవ హక్కుల ప్రకటన’ ద్వారా మానవాళికి మానవ హక్కులను అందించింది. అందుకే డిసెంబర్ 10ని ‘అంతర్జాతీయ మానవహక్కుల దినం’గా అన్నిదేశాల్లో జరుపుకొంటారు. మానవ హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదులను సత్వరం విచారించడానికి కోర్టులతో పాటు మనదేశంలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మానవహక్కుల కమిషన్‌లు ఏర్పాటయ్యాయి ” … !!