C.H.S సంస్థకు వివేకానంద సేవారత్న 2022 పురస్కారం

అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం పురస్కరించుకొని వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సంస్థకు వివేకానంద సేవారత్న పురస్కారం మరియు ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమం ప్రొద్దుటూరు ఎస్.ఆర్.ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణారెడ్డి నిర్వహించారు, రాయలసీమ ప్రాంత స్వచ్ఛంద సంస్థలలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 30 స్వచ్ఛంద సంస్థలను ఎంపిక చేసి ఈ అవార్డు ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సి.హెచ్.ఎస్ ప్రతినిధి గాడి.ఇంతియాజ్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాలలో విద్య, వైద్యం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాల నిర్వహణ, కరోనా విపత్తు సమయంలో మరియు అన్నమయ్య ముంపు గ్రామాల బాధితులను ఆదుకోవడంలో మొదలగు సామాజిక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా తమ వంతుగా నిస్వార్థంగా సేవలందిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నందుకు గుర్తింపుగా తమ సంస్థకు వివేకానంద సేవా రత్న 2022 పురస్కారం అందజేశారని, జిల్లాలవ్యాప్తంగా స్వచ్ఛంద సేవల డేటా కలెక్ట్ చేసుకుని వారి సామాజిక కార్యక్రమాలకు గుర్తించి ఇతరులను ప్రేరేపించే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించిన వివేకానంద ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు మరియు అవార్డులు గ్రహించిన తోటి స్వచ్ఛంద సేవకులకు అభినందనలు తెలియజేశారు.

చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ వ్యవస్థాపకులు మన్నూరు.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పురస్కారాలతో సత్కరించినప్పుడు ఇంకా సమాజ సేవ చేయాలనే పట్టుదల పెరుగుతుందని, నిస్వార్థంగా సి.హెచ్.యస్ సంస్థలో సేవలందిస్తున్న కార్యవర్గ సభ్యులకు మరియు సంస్థ సామాజిక అభివృద్ధి కార్యకలాపాలకు ఆర్థికంగా సహకరిస్తున్న దాతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.సమాజ సేవ చేయడానికి చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సంస్థ మంచి వేదిక అని తమ వంతుగా పాల్గొనడానికి యువత ముందుకు రావాలని కోరారు.

స్వామి వివేకానందుని 160 వ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు ఎస్.ఆర్.ఐటి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించిన ఈ అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కడప జిల్లా అసోసియేషన్ ఫర్ సోషల్ సర్వీసెస్ కన్వీనర్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, SRIT ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి మణికంఠ, ప్రముఖ సామాజిక కార్యకర్త రాజోలి శ్రీధర్ రెడ్డి, కళాశాల విద్యార్థులు,వివిధ జిల్లాల నుండి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తమ సి.హెచ్ఎస్ సంస్థకు దక్కిన గౌరవానికి హర్షం వ్యక్తం చేస్తూ కార్యవర్గ సభ్యులు గాల శివారెడ్డి, బొంతల శివ నాగేశ్వరరావు, కందుల నరసింహనాయుడు, చౌడవరం మహేష్ రెడ్డి,మాదినేని ప్రసాద్,గుత్తి జనార్ధన,కరీం షేక్,ఆనాల సుబ్రహ్మణ్యం రెడ్డి నాగిరెడ్డి పెంచల రెడ్డి,మహమ్మద్ షఫీ,నాగిరెడ్డి తిరుమలరెడ్డి,సమ్మెట వీరాంజనేయులు, షౌకత్ అలీ ఖాన్,రోల్ల మోహన్,పి. సునీల్ కుమార్ రెడ్డి,పి.సురేష్ నాథ్ రెడ్డి,షేక్ మౌలా, షేక్ షఫీ ,చక్రవర్తుల వరుణ్ కుమార్ రాజు, మహమ్మద్ ఇలియాస్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు..






” మానవ సేవే మాధవసేవ”
తమ సంతోషంతో పాటు తమ చుట్టూ ఉన్న వారి సంతోషాన్ని కాంక్షిస్తూ… నలుగురికి సాయం చేసేవారు స్వచ్చంద సేవకులు.. వారి సేవలను గుర్తించే రోజు ఈరోజు.
” అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం..”
సందర్భంగా సేవలందించే మా తోటి సేవామూర్తులందరికీ, తోటి N.G.O నిర్వాహకులందరికి మా హృదయ పూర్వక శుభాకాంక్షలు .
🙏🙏🙏🌹💐 💐🙏🙏

మానవ సేవే మాధవసేవ
చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ

Loading

admin
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *