ఇతరులందరి కంటే తక్కువ ధరలకు పేద కూలీల కడుపు నింపే విధంగా, టిఫిన్ సెంటర్ మరియు సంగటి, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెల హోటల్ పెట్టే వారికి మా శ్రీనివాస థియేటరు ముందు మా స్థలములో రెండు అంకనాల వెడల్పు స్థలమును నెలకు కేవలం ఒక్క రూపాయి బాడుగతో కనీసం మూడు సంవత్సరాలు ఇస్తాను… అని ఆ థియేటర్ యాజమాని అబ్బూరి శ్రీనివాసులు గారు తెలియజేస్తున్నారు
క్రింది విధంగా ఆహారాలు పెడితే తినే వారి కడుపు నింపినందుకు పుణ్యంతో పాటూ, కష్టానికి తగిన ఫలితం కూడా హోటల్ నడిపే వారికి ఉంటుంది.
1. పది రూపాయలకు అయిదారు ఇడ్లీలు లేదా రెండు పెద్ద దోశెలను చట్నీ, షేరువాతో లేదా అలసంద బేడల సాంబారుతో పెట్టాలి.
2. సుమారు 200 గ్రాముల బియ్యంతో అయ్యేంత కుష్కా అనగా అరకేజీ కుష్కా లేదా 200 గ్రాముల బియ్యం మరియు 50 గ్రాముల రాగి పిండితో అయ్యేంత సంగటి లేదా 300 గ్రాముల జొన్న లేదా సజ్జ పిండితో రొట్టెలు లేదా 300 గ్రా గోధుమ పిండితో పుల్కాలు మరియు కోడి కాళ్ళు, తలకాయలు, మెడకాయలతో చేసిన షేరువాను 150 మి.లీ. పరిమాణంలో రెండు గరిటెల (సుమారు 100 గ్రాముల) ముక్కలతో లేదా అలసంద బేడలతో పప్పు లేదా పులుసు కూర లేదా శనగలు లేదా బఠానీల కూర లేదా రొట్టెల్లోకి కూరగాయల కూర రు.30/-లతో తయారు చేయగలిగి, రు.40/- లకు పెడితే మూడు పూటలకు కలిపి రోజుకు వంద మంది కూలీలు తింటే, స్వంతంగా అన్ని పనులు చేసుకుంటూ హోటల్ నడిపే భార్యాభర్తలైన లేదా ఇతరులైన ఇద్దరు మనుషులకు కలిపి రోజుకు ఒక వెయ్యి అంటే, ఒక్కొక్కరికి అయిదు వందలు కూలి గిడుతుంది. రెండు వందల మంది తింటే రోజుకు రెండు వేలు, అంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల కూలి గిడుతుంది.
పేద కూలీల కడుపు నింపిన పుణ్యంతో పాటూ కుటుంబ పోషణకు తగిన ఆదాయం కూడా వస్తుంది.
మీ
అబ్బూరి శ్రీనివాసులు
6304371012