కోడూరులో మెయిన్ సంత ఆదివారమే.
కానీ ఆదివారం రాలేని వ్యాపారులు శనివారం లేదా సోమవారం వచ్చి అంగళ్ళు పెట్టుకోవచ్చు.
పెట్టగలిగే వారు వరుసగా రెండు లేదా మూడు రోజులు అయినా అంగళ్ళు పెట్టుకోవచ్చు.
శనివారం, సోమవారం కొనడానికి ఎక్కువగా పల్లెల వారు వస్తారు. వాళ్ళు ఆదివారం అదే పనిగా సంత కోసం ఛార్జీలు పెట్టుకుని కోడూరుకు రారు. ఆదివారం 100 రూపాయల వ్యాపారం జరిగితే, శనివారం, సోమవారం రోజుల్లో ఒక రోజుకు 50 నుండి 75 రూపాయలు చొప్పున జరగవచ్చు. మూడు రోజులకు కలిపి 200 నుండి 250 రూపాయల వ్యాపారం జరుగుతుంది.
కరోనా తర్వాత ఇండ్ల దగ్గరికే వ్యాన్లలో, ఆటోల్లో, తోపుడు బండ్లపై సరుకులను తెచ్చే వారు ఎక్కువ అయినప్పుడు, పాత కాలంలో లాగా వారానికి ఒక రోజే సంత నడుపుతామంటే, కరోనాకు ముందు కాలంలో లాగా వ్యాపారాలు జరగడం కష్టం.
రోజూ ఇండ్ల దగ్గరికే ఫ్రెష్ సరుకులు వస్తుంటే, వారానికి సరిపడే సరుకులను ఒకేసారి సంతలో తీసుకుని ఫ్రిజ్ లో ఎందుకు పెట్టుకుంటారు?
కాబట్టి వ్యాపారులు గతంలో ఎడ్ల బండ్ల కాలంలో లాగా వారానికి ఒకే రోజు సంత అనే ఆలోచన మాని, వ్యాన్ల కాలాన్ని బట్టి, మార్పులను బట్టి సంతలో రెండు మూడు రోజులు అంగళ్ళు పెట్టడం లేదా డైలీ మార్కెట్ లాగా అంగళ్ళు పెట్టడం మంచిది.
ఆదివారం ఒక్క రోజు అయితే కొంత కాలానికి సంత నిలిచిపోతుంది.
ఇట్లు
అబ్బూరి శ్రీనివాసులు
6304371012
9291353947