*పరీక్ష ఫలితాల సమయం తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు విజ్ఞప్తి* 🙏
దయచేస తల్లిదండ్రులకు విషాదాన్ని నింపకండి..!!
మీరు సాధించాలి అనుకున్నది ఈరోజు కాకపోతే రేపు అయినా సాధిస్తారు..
ప్రాణం పోతే తిరిగి రాదు
క్షణికావేశం లో నిర్ణయాలు తీసుకోకండి..
# *తల్లిదండ్రులకు మనవి* దయచేసి మీ పిల్లలుని మీరే అర్థం చేసుకోండి వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వండి..!
ఈరోజు కాకపోతే మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు.
మీ పిల్లలు మీకు ముఖ్యం
మీ పక్క ఇంటి వాళ్ళతోనో ఎదురింటి వాళ్ళతోనో మీ పిల్లలను పోల్చకండి.
పిల్లలుకు ఈ టైమ్ లో తల్లిదండ్రులే ధైర్యం బలం.
# *చుట్టుపక్కల వాళ్లకు మనవి*
మాట అనడం తేలిక తీసుకోవడం కష్టం
మీ మాటలు వల్ల అవతల వారి ప్రాణాలు తీసుకునే పరిస్థితి కి వస్తే ఆ తల్లిదండ్రులు బాధ అర్థం చేసుకోండి.
ఆ ప్లేస్ లో మీ పిల్లలను తలుచుకోండి ఆ బాధ ఏంటో మీకు అర్థం అవుతుంది.
వీలు అయితే నాలుగు మంచి మాటలు చెప్పండి,
ధైర్యం ఇవ్వండి,
అంతేకాని సూటుపోటు మాటలతో సూదిలా గుచ్ఛకండి..!
# *స్నేహితులకు ఒక్కమాట* ..!
ఉదయం లేచి నుంచి రాత్రి పడుకున్న వరకు మీరు అందరూ కలిసి ఉంటారు.
కష్టం సంతోషం ప్రతిదీ కలిసే పంచుకుంటారు ,
ఇలాంటి టైంలో నే మీరు మీ స్నేహితులతో కొంత సమయం గడపాలి.
వాళ్లకు మేము ఉన్నాం అనే ధైర్యం బలం మీరే ఇవ్వాలి.
ఎవరి మనసత్వాలు ఏంటి అనేది తల్లిదండ్రులు కంటే మీకే
అర్థం అవుతుంది.
..దయచేసి పిల్లలు మనసత్వాలు చాలా చిన్నవి..
దేన్ని అర్థం చేసుకునే మనసులు వాళ్ళవి కావు,
ఈ సమాజాన్ని వాటి మాటలని అర్థం చేసుకుని వయసు కాదు మన మాటలతో చేతలతో వాళ్ళ చిన్న మనసుల్ని బాధ పెట్ట వద్దు..!
*సర్వేజనామ్ సుఖినోభవంతు* 🤝🤝🙏🙏
..దయచేసి క్షణికావేశం ఆత్మహత్య లు చేసుకోకండి.
మిమ్మలిని నమ్ముకున్న మీ తల్లిదండ్రులు కు వేదన మిగిల్చకండి..