ప్రతి రోజూ లేదా వారంలో మీకు వీలైన ఏ రోజుల్లో అయినా ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకూ మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ శ్రీనివాసా సినిమా హాలు ప్రాంగణంలో అంగళ్ళు పెట్టుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు మీకు ఇష్టం వచ్చినంత బాడుగ ఇవ్వవచ్చు. కోడూరు పంచాయతీ గేటు కాంట్రాక్టర్లకు మా థియేటరు ప్రాంగణంలో పెట్టే అంగళ్ళకు గానీ, సరుకులను తెచ్చే వాహనాలకు గానీ ఎలాంటి గేటు రుసుములను చెల్లించవలసిన అవసరం లేదు.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ చుట్టు పక్కల పల్లెల్లో తిరిగి అమ్ముకోవచ్చు కానీ కోడూరు టవున్ లో మరియు కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలో తిరిగి అమ్మకూడదు.
కరంటు, నీళ్ళు, రాత్రిళ్ళు నిద్రపోవడానికి వరండాలు, టాయిలెట్ సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం ఉన్నాయి. ప్రతి అంగడికి పెద్ద పెద్ద ఎల్ఈడీ బల్బులతో, సీరియల్ లైట్లతో లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. తక్కువ శబ్దంతో మెగా ఫోన్ మైక్ పెట్టవచ్చు. దుమ్ము, ధూలి, వాహనాల పొగ లాంటి వాటి కాలుష్యంతో మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం దాదాపు ఉండవు. అంగళ్ళు పెట్టే వారికి, కస్టమర్లకు ప్రమాదాలు జరిగే అవకాశం ఏ మాత్రం ఉండదు.
థియేటరు ప్రాంగణంలో ఓపెన్ స్థలములో అంగళ్ళు పెట్టేవారు మీ అంగడి స్థలానికి గుంజలు నాటుకొని పట్ట కట్టుకోవచ్చు, పందిరి వేసుకోవచ్చు, రేకులు వేసుకోవచ్చు. థియేటరు వరండాలలో, ఆడిటోరియంలో అంగళ్ళు పెట్టే వారికి పట్ట, పందిరి, రేకుల అవసరం ఉండదు.
మీ అంగట్లో దర్జాగా కుర్చీ వేసుకుని కూర్చుని అమ్మవచ్చు.
మీరు అమ్మే వస్తువులు, సరుకులు స్వయంగా పండించినవి లేదా తయారు చేసినవి లేదా నేరుగా రైతులు మరియు తయారీదారుల వద్ద కొన్నవి లేదా బయట ఊర్ల నుండి నేరుగా తెచ్చేవి అయి ఉండాలి. కోడూరు పంచాయతీ గేటు కాంట్రాక్టర్లకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గేటు రుసుములను చెల్లించే వారి వద్ద అనగా స్థానిక హోల్ సేల్ వ్యాపారుల వద్ద కొని తెచ్చి అమ్మరాదు. వారంలో ఏ రోజు కూడా ఏ విధంగా కూడా కోడూరు గేటు కాంట్రాక్టర్లకు గేటు రుసుములను కట్టే వారికి మా ప్రాంగణంలో అంగళ్ళు పెట్టుకునే అవకాశం ఇవ్వబడదు.
జీవాల సంత
ప్రతి శుక్రవారము.
రైతు బజారు
ప్రతి బుధవారము.
(పండించే రైతులకు మాత్రమే అవకాశం)
సండే బజారు – నిత్యావసరాల సంత
ప్రతి ఆదివారము
(ఇతర ఊర్ల సంతలలో అంగళ్ళు పెట్టే వారికి మరియు పండించే రైతులకు మాత్రమే అవకాశం).
రైల్వేకోడూరులో శ్రీనివాసా సినిమా హాలు ప్రాంగణంలో
వెంటనే వచ్చి మీ అంగళ్ళకు స్థలాలను రిజర్వేషన్ చేసుకోండి.
ముందుగా వచ్చిన వారికి ముందరి స్థలాలు దొరికే అవకాశం.
ఈ పోస్ట్ ను చూసిన ప్రతి ఒక్కరూ, తమకు తెలిసిన రైతులకు, సంతల వ్యాపారులకు, పొట్టేళ్లు, గొర్రెలు, మేకపోతులు, మేకలు, నాటు కోళ్ళు, ఆవులు, ఎద్దులు, గేదెలు లాంటి వాటిని పెంచే వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.
మీ
అబ్బూరి శ్రీనివాసులు
9291353947
6304371012