“మాతృదేవోభవ పితృదేవోభవ – ఆచార్యదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. “గురువు” అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. “గు” అంటే చీకటి. “రు” అంటే తొలగించు అని అర్ధం… గురువులందు ఆదర్శ గురువులు ప్రధములు, అటువంటి వారిలో మనందరి హృదయాలలో ఆత్మీయ బోధనతో మా అందరి జీవితాలలో విద్య అనే బీజం నాటిన వారిలో ప్రముఖులు దావూద్ ఖాన్ సార్ గారని చెప్పుకోవచ్చు 🙏 🙏
#దావూద్ఖాన్ సార్ అంటే – క్రమశిక్షణకు మారు పేరు, సార్ వస్తున్నారు అంటే ఆ పరిసర ప్రాంతం అంత ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్. అన్ని సబ్జక్ట్స్ ధారాళంగా చాలా చక్కగా అర్థం అయ్యే టట్లు వివరించడం లో వారికి వారే సాటి. 6 & 7తరగతుల వరకు మాత్రమే పాఠాలు బోధించినా 10th క్లాస్ విద్యార్థుల వరకు మాస్టరు గారు అంటే హడల్ .. ఆయన వ్యంగ చాతుర్యానికి పారవశ్యం కాని విధ్యార్థి / తొడ పాశంనుండి తప్పించుకున్న విద్యార్థి లేడంటే అతిశయోక్తి కాదు 😍😍, దావూద్ ఖాన్ సార్ గారు విధ్యార్థులతోనే కాకుండా వారి తల్లిదండ్రులతోనూ మృదు భాష్యంతో మంచి సంబంధాలను నెరిపారు.👍👍
#స్థానికులు కానప్పటికీ దాదాపు పాతిక సంవత్సరాలు చిట్వేలి ఉన్నత పాఠశాలలోనే పనిచేయడం మరియు చిట్వేలి నడిబొడ్డున వున్న తన ఇంటివద్ద నుంచి విధ్యాబోధన నందించడం కారణంగా గ్రామస్తులకు చిరపరిచయస్తులు. ఆ విదంగా గ్రామస్తులకు అనేక కార్యకలాపాలలో మార్గదర్శనం చేస్తూ అందరి ఆదరాభిమానాలను సంపాదించిన ఆ చిరంజీవి విధి నిర్వహణలోనే అశువులు కోల్పొవడం బాధాకరం. 😥😥😥అలాంటి పుణ్యమూర్తులు సమాజంలో బహు అరుదుగా ఉంటారు..!!!!
#ఆ ఆదర్శఉపాధ్యాయుడు / మార్గదర్శి కీ.శే. శ్రీ దావూద్ ఖాన్ సార్ గారి వర్ధంతి నేడు (10/01/1990, ZPHS,CHITVEL) ,
వారి యొక్క జ్ఞాపకాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించుకుంటున్నాను.
💐💐🙏🙏🙏🙏
~ CHS